ఘనంగా ద్వాదశి వేడుకలు

8 Feb, 2017 23:51 IST|Sakshi
ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామునే వేడుకలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్పాభిషేకాలు గావించి మహా మంగళహారతులు పట్టారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణులు ఉపవాస దీక్షలో ఉండటంతో 8 గంటలకే అన్నపూర్ణభోజన శాలలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. భక్తుల రాకతో పంచామృతం, దర్శన, అన్నపూర్ణభోజనశాల క్యూలైన్లు›కళకళలాడాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, వెండి, బంగారు, చెక్క రథాలపై కన్నుల పండువగా ఊరేగించారు. మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
>
మరిన్ని వార్తలు