ఆహ్లాదకరం.. పచ్చని తోరణం

21 Aug, 2016 17:51 IST|Sakshi
జాతీయ రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలు

కల్హేర్‌: జాతీయ రహదారికిరువైపులా మర్రి వృక్షాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సంగారెడ్డి - నాందేడ్‌ 161 నంబర్‌ జాతీయ రహదారిపై దాదాపు వంద ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు పచ్చదనం పర్చుకున్నాయి. నిజాం సర్కార్‌ హయాంలో రహదారికి ఇరువైపుల మర్రి చెట్లు నాటినట్లు పూర్వికులు చెపుతున్నారు. రహదారిపై వందల సంఖ్యలో ఉన్న చెట్లు భారీ వృక్షాలుగా ఎదగాయి. మాసాన్‌పల్లి చౌరస్తా, బాచేపల్లి సమీపంలో ఉన్న వృక్షాలు స్వాగతతోరణాలను తలపిస్తున్నాయి.  రహదారిపై చెట్లను చూసి ప్రకృతి ప్రేమికులు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు