అన్నవరంలో అరగంట ఉచిత ‘వైఫై’

7 Aug, 2016 01:02 IST|Sakshi
అన్నవరంలో అరగంట ఉచిత ‘వైఫై’
అన్నవరం దేవస్థానంతో బెంగళూరుకు చెందిన కంపెనీ ఒప్పందం
సెల్‌ సిగ్నల్స్‌ స్పష్టంగా అందించేందుకు ఏంటెన్నాల ఏర్పాటు
ట్రాన్స్‌పోర్టు, సహజ కాంట్రాక్ట్‌ సిబ్బంది వేతనాల పెంపు
ఘాట్‌రోడ్‌ ముఖద్వారంలో హైమాక్స్‌ దీపాలు
దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు తీర్మానాలు

అన్నవరం : అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తులు ఇకపై అరగంట పాటు ఉచితంగా ‘వైఫై’ సదుపాయం పొందవచ్చు. ఇందుకు బెంగళూరుకు చెందిన ‘బాల్గో ఇన్‌ఫ్రా’ సంస్థ  దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. శనివారం దేవస్థా నం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు, అధికారులతో జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ ఐదు ప్రముఖ సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ సిగ్నల్స్‌ అందించేందుకు దేవస్థానంలో ఐదు ఏంటెన్నాలను ఏర్పాటు చేస్తుందని, ఏంటెన్నాకు నెల కు రూ.ఐదు వేలు అద్దె చెల్లిస్తుంది. తద్వారా భక్తులకు పూర్తి స్థాయిలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందుబాటులోకి రావడంతో పాటు మొదటి అరగంట ‘వైఫై’ సిగ్నల్స్‌ ఉచితంగా వాడుకోవచ్చు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతి కూడా లభించింది. మున్ముందు మరో రెండు సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సేవలు కూడా ఆ కంపెనీ అందుబాటులోకి తెస్తుంది. సమావేశంలో పలు అంశాలను తీర్మానించారు.

ముఖ్యమైన తీర్మానాలు
–రత్నగిరి ఘాట్‌రోడ్‌లోని ఆర్చి గేటు ముందు రూ.6.60 లక్షలతో హైమాక్స్‌ విద్యుద్దీపాలు ఏర్పాటు
l దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లు, కాంట్రాక్ట్‌ కండక్టర్ల వేతనం రూ.8,500కు, అలాగే కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు వేతనం రూ.10,500కు  పెంచేలా కమిషనర్‌కు నివేదిక.
–సహజ ప్రకృతి చికిత్సాలయ సిబ్బందిలో మసాజర్స్, ఇతర స్కిల్డ్‌ ఉద్యోగుల వేతనాన్ని రూ.7,500కి, సెంట్రీ, నైట్‌ వాచ్‌మన్‌ వంటి అన్‌స్కిల్డ్‌ ఉద్యోగుల వేతనాన్ని రూ.6,500కు పెంచేందుకు నిర్ణయం.
–దేవస్థానంలో విద్యుత్‌ ఆదా చర్యల్లో భాగంగా పాత మోటార్ల స్థానంలో 5స్టార్‌ రేటింగ్‌ కలిగిన 11 సబ్‌మెర్సిబుల్‌ మోటార్లను రూ.ఏడు లక్షలతో కొనుగోలు చేసేందుకు టెండర్‌ పిలించేందుకు నిర్ణయం.
–సీతారామ సత్రం ఉత్తరం వైపు బ్లాక్‌లో రూ.9.90 లక్షలతో బాత్‌రూమ్స్‌లో కొత్తగా టైల్స్‌ ఏర్పాటు, కొత్త పైపులు వేయడం వంటి పనులకు టెండర్ల ఆహ్వానం. అనంతరం దక్షణం వైపు బ్లాక్‌ మరమ్మతులకు కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.
>
మరిన్ని వార్తలు