రూ. 6కోట్ల పనులకు రూ.36 కోట్లు ప్రతిపాదిస్తారా?

14 Apr, 2016 02:09 IST|Sakshi
రూ. 6కోట్ల పనులకు రూ.36 కోట్లు ప్రతిపాదిస్తారా?

మహబూబ్‌నగర్ జిల్లా అధికారులపై మంత్రి ఆగ్రహం
ఈ నిధులతో మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించవచ్చు
బాధ్యులందరికీ నోటీసులు జారీ చేస్తాం
పనిచేయలేని అధికారులు వెళ్లిపోవచ్చు
‘మిషన్ కాకతీయ’పై ఖేడ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్

 నారాయణఖేడ్: ఒక ఎకరం కూడా నీరందించని చెరువుకు రూ.6 కోట్లు సరిపోతాయని, దానికి రూ.36 కోట్లు ప్రతిపాదిస్తే ఎలా అని మహబూబ్‌నగర్‌జిల్లా అధికారులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ నిధులతో మధ్యతరహా ప్రాజెక్టునే నిర్మించవచ్చని, ఈ ప్రతిపాదనల ఫైలుపై సంతకం చేసిన అధికారులందరికీ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతోపాటు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు.

జిల్లాల వారీగా మిషన్ కాకతీయ పథకం పనుల తీరుతెన్నులను సమీక్షించారు. మిషన్‌కాకతీయ పనుల్లో మహబూబ్‌నగర్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉండడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో అధికారుల అలసత్వం సరికాదన్నారు. వారం తర్వాత మళ్లీ సమీక్షిస్తానని, అప్పటిలోగా పరిస్థితుల్లో మార్పు రాకుంటే సహించేది లేదన్నారు. పనిచేయలేని అధికారులు వెళ్లిపోవచ్చన్నారు. ఇతర జిల్లాల్లో 90 శాతం పురోగతి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 50 శాతం వరకే ఉందని మం త్రి పేర్కొన్నారు.

కేవలం 30 శాతమే అగ్రిమెంట్లు అయ్యాయని, ఇందుకు ఎస్‌ఈ బాధ్యత వహించాలి కదా అని ప్ర శ్నించారు. డివిజన్ల వారీగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. జూన్ తొలి వారంలో వర్షాలు కురుస్తాయని, ఆ రేడు వారాల్లో పనుల అగ్రిమెంట్లు పూర్తవ్వాలన్నారు. త్రిబుల్‌ఆర్, నాబార్డు ఫేస్ 2, 3, 4 పనులు వేగవంతం చేయాల న్నారు. జైకా, ప్రపంచ బ్యాంకు నిధులు జూన్‌లోపు ఖర్చు చే యాలన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు సంతకాలు చేస్తే వారే బాధ్యత వహించాలని, చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు