ఈయన కరెంట్‌ను పట్టుకుంటారు..

26 Jun, 2016 00:36 IST|Sakshi
ఈయన కరెంట్‌ను పట్టుకుంటారు..

పరకాల: కరెంటు సరఫరా అవుతున్న వైర్లు పొరపాటున తగిలినా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం.  కానీ, ఆయనకు మాత్రం కరెంటు అంటే భయం లేదు. కరెంటు సరఫరా అయ్యే వైర్లను ముట్టుకోవడమే కాదు.. ఏకంగా వాటిని నోట్లో పెట్టుకుంటాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం శని గరం గ్రామానికి చెందిన సెగ్గోజు బ్రహ్మానందం ఐటీఐలో డీజిల్ మెకానిక్ పూర్తి చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్ మండలం సింగపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నారు. సెలవురోజుల్లో వరంగల్ జిల్లా పరకాలలో ఫ్యాన్లు, కూలర్లు, విద్యుత్ మోటార్లును రిపేర్ చేస్తుంటాడు.

కరెంటు సరఫరా అవుతున్న వైర్లను నోటిలో పెట్టుకొని చూపుతుంటారు. సరఫరా అవుతున్న వైర్లను పట్టుకున్న ఆయనకు టెస్టర్‌తో పరీక్షిస్తే దాని లైటు వెలుగుతుండడం విశేషం. ఎలక్రికల్ వస్తువులు రిపేరు చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు వైర్లు తగిలినా షాక్ వచ్చేది కాదని, ఒకసారి వైర్లను ముట్టుకున్నా ఏమీ కాలేదని, అప్పటి నుంచి కరెంటు ఉన్న ైవె రును చేతితో పట్టుకోవడం ప్రారంభించానని చెబుతున్నారు.

 

 

మరిన్ని వార్తలు