హిందూధర్మంపై దాడులు అరికట్టాలి

23 Oct, 2016 19:10 IST|Sakshi
రాజమహేంద్రవరం కల్చరల్‌ :
హిందూధర్మంపై బహుముఖ దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకపోతే హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని సమరసత సేవా ఫౌండేష¯ŒS ప్రాంత కార్యదర్శి రాంకుమార్‌ అన్నారు. సమరసత ఫౌండేషన్‌ జిల్లాశాఖ, సామాజిక సమరసత వేదిక, వికాస తరంగిణి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలోని రామానుజ కూటమిలో జిల్లాస్థాయి సదస్సు జరిగింది. రాం కుమార్‌ మాట్లాడుతూ అన్ని మండలాలలో ’ధర్మరక్షక్‌’ కార్యకర్తలను నియమిస్తామని, దేవాలయాలు ధర్మప్రచార కేంద్రాలుగా పనిచేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి పల్లెలో, దళిత, గిరిజన వాడల్లో ఆలయాలు, భజన మందిరాలు నిర్మించుకోవాలని, భజన సంకీర్తన గురువులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి హిందువు తన ఇంటిపై హనుమద్ధ్వజం ఎగురవేయాలన్నారు. సమరసత ఫౌండేష¯ŒS ద్వారా జరిగే ఈ మహోద్యమంలో ప్రతిహిందువు భాగస్వామి కావాలని, ఫౌండేష¯ŒS ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు హిందూ హెల్ప్‌లై¯ŒS టోల్‌ఫ్రీ నంబరు 1800 599 2399ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంయోజక్‌ శ్యాం ప్రసాద్, జిల్లా ధర్మ ప్రచారక్‌ కర్‌?ర శ్రీనివాసరావు, బండ్ల శంకర్‌ పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు