ఏఎస్పీపై మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపాటు

20 Aug, 2016 00:26 IST|Sakshi
అసమ్మతి రాగంతో డీఎస్‌ను ఆహ్వాననిస్తున్న అర్చకులు
అలంపూర్‌ / అలంపూ రూరల్‌ : ఆలయ అర్చకులకు ఎదురైన సమస్యలను రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డికి దష్టికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తీసుకెళ్లారు. శుక్రవారం అలంపూర్‌ ఆలయంలో బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవార్లను మంత్రి దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత   ఏఎస్పీ విజయ్‌కుమార్‌ని పిలిపించి బ్రాహ్మణులను గౌరవించకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఏఎస్పీ బదులివ్వడంతో అర్చకులు శాంతించారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిషనర్‌ రామకృష్ణ, ఏసీ బి.కృష్ణ, , దేవస్థానం ఈఓ గురురాజ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పర్వతాలు ఉన్నారు.
 
అర్చకుల నిరసన
  ఆలయాలను దర్శించేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ పట్ల ఏఎస్పీ విజయ్‌కుమార్‌ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న అర్చకస్వాములు శుక్రవారం విధులను బహిష్కరించారు. అక్కడికి వచ్చిన డీఎస్‌కు వారు సమస్యలతో స్వాగతం పలికారు. దీంతో పక్కనే ఉన్న మాజీ ఎంపీ మందా జగన్నాథం అర్చకులకు సర్దిచెప్పారు. తక్షణమే మరో అధికారిని నియమిస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూస్తామనడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ లక్ష్మీనారయణ, ఆర్డీఓ లింగానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు