విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం

29 Dec, 2016 02:29 IST|Sakshi
విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం

- ముగ్గురు హైదరాబాద్‌ వాసుల మృతి
- ముగ్గురి పరిస్థితి విషమం

ఎస్‌.రాయవరం: విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు సహా ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ హయత్‌ నగర్‌లో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 11మంది విశాఖ బంధువుల ఇంటికి వచ్చారు. వారు విశాఖ నుంచి స్కార్పియోలో అన్నవరం వెళుతుండగా గోకుపాడు జంక్షన్‌ దాటిన తరువాత కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకుపోయింది.

ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న రూప (45), రాజేష్‌ (40) అక్కడిక్కడే మృతి చెందగా సుభోసింగ్‌ (18) ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఇదే కారులో ఉన్న ఏడాది చిన్నారి శ్రామేలికి, నేహా సింగ్, గీతా సింగ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల వయస్సులోపు వయసున్న యహోసింగ్, రిషి సింగ్, అభిషేక్, మరో మహిళ బిందుప్రియ, బండి నడుపుతున్న అభిజీత్‌లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్ప త్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ శ్రీనివాస్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ