విద్యార్థులతో చెలగాటం

19 Nov, 2016 01:00 IST|Sakshi
విద్యార్థులతో చెలగాటం

మరోమారు ఎస్వీయూలో నిర్లక్ష్యం
సిలబస్ లేని పాఠాల నుంచి ప్రశ్నలు
కేవలం 15 మార్కులకే {పస్తుత పాఠ్యాంశాల ప్రశ్నలు 
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థుల ఆందోళన

మదనపల్లె అర్బన్: ఎస్వీ యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏమాత్రం అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నారుు. మూడురోజుల క్రితం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలలో ఇంగ్లీషు ప్రశ్నపత్రం సిలబస్‌కు విరుద్ధంగా వచ్చిందని విద్యార్థులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో జరిగిన తప్పులపై రిజిస్ట్రార్ దేవరాజులు విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రకటించిన 24 గంటలలోపే మరో తప్పిదం జరిగింది. శుక్రవారం మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం ప్రస్తుత సిలబస్ పాఠం కాకుండా గత పుస్తకం నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు బిక్కముఖం వేశారు. తెలియని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి మొదటి సెమిస్టర్‌కు సంబంధించి గంగాశంతనుల కథ, మూషిక మార్జాల వృత్తాంతం, దేశచరిత్రలు, మా కొద్దీ తెల్లదొరతనం, బిడ్డలు, ఆకలి అనే పాఠాలు ఉన్నా రుు. వీటిలో నుంచి కేవలం 15 మార్కులకు గంగాశంతనుల కథ, దేశచరిత్రలు, వ్యాకరణంపై ప్రశ్నలు అడిగారు.

మిగిలిన 60 మార్కులకు పాఠ్యపుస్తకంలో లేని ద్రౌపదీ పరిదేవనం, కన్యక, చింతలతోపు, సావుకూడు పాఠాల నుంచి ప్రశ్న లు వచ్చారుు. ప్రశ్నపత్రంలోని సెక్షన్-ఎలో 5 మార్కులకు ఇచ్చిన 2,3,4,5,6 ప్రశ్నలు, సెక్షన్-బిలో 10 మార్కులకు ఇచ్చిన 1లో ఆ), 2,3,లోని ఛారుుస్ ప్రశ్నలు, 4వ ప్రశ్నపై విద్యార్థులకు ఏ మాత్రం అవగాహన లేకపోవడం, అధ్యాపకులు బోధించకపోవడంతో పరీక్ష  రాయలేకపోయారు. డిగ్రీ స్థారుులో ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంలో మొదటి సంవత్సరం పుస్తకాలు కాదని, రెండో సంవత్సరంలో వేరే పుస్తకాలు పెట్టడం వల్లే ఇలాంటి గందరగోళం చోటు చేసుకుందని తెలిసింది.

విద్యార్థులకు  న్యాయం చేస్తాం
ప్రశ్నపత్రంలోని ప్రశ్నల గందర గోళంపై పరీక్షల నియంత్రణాధికారి చంద్రయ్య వివరణ ఇస్తూ  బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ నుంచి నివేదిక కోరుతామని తెలిపారు.  సిలబస్‌లోని ప్రశ్నలు ఇచ్చినట్టు గుర్తిస్తే విద్యార్థులకు మార్కులు ఇచ్చి న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు