సత్వరమే సేవలు

21 Aug, 2016 21:13 IST|Sakshi
సత్వరమే సేవలు
బస్‌స్టేషన్‌ :  
పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ను ఆర్టీసీ ఎం.డీ, డీజీపీ నండూరి సాంబశివరావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్‌లో పుష్కర యాత్రికులతో విపరీతమైన రద్దీ నెలకొనడం, రైల్వే డీఆర్‌ఏం నుంచి రైళ్లు ఖాళీలేవని, అటువైపు సిటీ బస్సులు పంపవద్దని కోరిన నేపథ్యంలో ఆయన బస్టాండ్‌ను సందర్శించి బస్సుల రాకపోకలను పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి వారి గమ్మస్థానాల్ని తెలుసుకుని కొందరిని ఆర్టీసీ జీపుల్లో రైల్వేస్టేషన్‌కు పంపించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పెద్దసంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు వచ్చారని, వారందర్ని వేగంగా పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం కూడా ఎక్కువమంది యాత్రికులు రావచ్చని, ఇబ్బంది లేకుండా గమ్మస్థానాలకు పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లాలలోని అన్ని డిపోల నుంచి బస్సుల్ని ఇందుకు రప్పించాలని చెప్పారు. ముందు శాటిలైట్‌ బస్‌స్టేçÙన్లకు యాత్రికుల్ని పంపిస్తే అక్కడనుంచి ఇతరత్రా ప్రాంతాల బస్సుల్లో వెళ్లిపోతారని అన్నారు. ఆర్టీసీ బస్సులపై పుష్కరాలు ఆధారపడి ఉన్నాయని, శక్తివంచన లేకుండా మరో రెండు రోజులు ‘ఆపరేషన్‌’ పూర్తి చేయాలన్నారు.  
 
 
 
మరిన్ని వార్తలు