వేధింపుల భర్తకు మూడేళ్ల జైలు

19 Oct, 2016 00:22 IST|Sakshi
ధర్మవరం అర్బన్‌ : ధర్మవరానికి చెందిన అమీర్‌బాషా కుమార్తె మెహతాజ్‌బేగంను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో ఆమె భర్త హాజీవలికి జైలు శిక్ష ఖరారైందని పోలీసులు తెలిపారు. 2005 మే 29న వీరి పెళ్లి కాగా, మూడు నెలలకే భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు అప్పట్లో స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు గృహహింస కింద హాజీవలికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ పుల్లయ్య మంగళవారం తీర్పు చెప్పారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు