ఇస్రో జయహో

14 Feb, 2017 23:25 IST|Sakshi
ఇస్రో జయహో
  • నేడు ఆకాశ వీధిలో అరుదైన ఘట్టం
  • 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్ష 
  •  
    భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధవ¯ŒS స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరి కోట) నుంచి పంపనున్న పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌– సీ37(పీఎస్‌ఎల్‌వీ) బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహన నౌక విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోశాట్‌ 2డి, ఐఎ¯ŒSఎస్‌–1ఏ, ఐఎ¯ŒSఎస్‌– 1బీ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయోగం సక్సెస్‌ కావాలని జిల్లావాసులు పలువురు ఆకాంక్షించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
     
    ఈ ప్రయోగం దేశానికి గర్వకారణం 
    పి.గన్నవరం : పీఎస్‌ఎల్‌వీ–సీ37 ప్రయోగం విజయవంతమై.. భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ రికార్డు సృష్టించనుంది. నేను 2012 సెప్టెంబర్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా చేరా. అప్పటి నుంచి తిరువానంతపురంలోని విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాయి. సీ37 ప్రయోగం భారతదేశ ప్రజలకు ఎంతో గర్వకారణం. మొత్తం 104లో భారత దేశానికి చెందిన మూడు ఉపగ్రహాలతో మనకు ఎంతో కీలమైన సమాచారం లభిస్తుంది. రానున్న రోజుల్లో మన ఇస్రో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఇస్రో ప్రయోగాలతో రోజు, రోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత సద్వినియోగం చేసుకుని, దేశాభివృద్ధికి పాటుబడుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రస్తుతం తిరువానంతపురం స్పేస్‌ సెంటర్‌లో మార్చి నెలలో ప్రయోగించనున్న ఎఫ్‌09 మిష¯ŒSకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్నా.
    – ఆదిమూలం సూర్యతేజ, ఇస్రో శాస్త్రవేత్త, ఆదిమూలంవారిపాలెం, పి.గన్నవరం మండలం
     
    యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం
    తుని రూరల్‌ : ‘‘దేశ యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా పీఎస్‌ఎల్‌వీ సీ–37 రాకెట్‌ ప్రయోగం నిలుస్తుంది. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో ప్రపంచదేశాల్లో భారత్‌ అగ్రభాగాన నిలువనుంది. అరుదైన ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా ప్రపంచ అంతరిక్ష శాస్త్ర పరిశోధనల్లో భారత్‌ ఆధిపత్యం వహించగలదు. సాప్‌్టవేర్, హార్డ్‌వేర్‌ రంగాలపై పరుగులు తీస్తున్న యువత అంతరిక్ష పరిశోధనలపై మళ్లే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా మనదేశం శాస్త్రీయ, విజ్ఞాన, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో ముందంజ వేస్తుంది. 
    మోడల్‌ రాకెట్రీ ప్రయోగంలో.. 
    విఫ్‌టెక్‌ ద్వారా 2014 నవంబరు 17 నుంచి నాలుగు రోజులు చెన్నైలో జరిగిన మోడల్‌ రాకెట్రీ వర్క్‌షాపులో పాల్గొన్నా. ఈ సందర్భంలో రాకెట్‌ లక్ష్యం, అందుకు అనుగుణంగా ఏవిధంగా తయారు చేయాలి? అన్న అంశాలపై శిక్షణ, అవగాహన, ప్రయోగం కార్యక్రమాల్లో పాల్గొన్నా. రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్, శాస్త్రవేత్తలతో సమావేశాలు, మ్యాప్‌ల పరిశీలన, పరిశోధనల్లో సహచరులతో సమన్వయం వంటి విలువైన విషయాలు తెలుసుకున్నా. వాటిని తమ స్కూల్లో విద్యార్థులకు వివరించా. ప్రతి పౌరుడు షార్‌ను పరిశీలించేందుకు ఠీఠీఠీ.ఠిజీpn్ఛ్ట.ఛిౌఝ వెబ్‌ను సందర్శించాలి.  
    – సుర్ల సత్యనారాయణమూర్తి, 
    మోడల్‌ రాకెట్రీ ప్రయోగకర్త, సై¯Œ్స ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, తేటగుంట
     
     
    విజయవంతం కావాలని మానవహారం, ర్యాలీ 
    పెద్దాపురం : ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో జన విజ్ఞాన వేదిక, యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద మానవహారం నిర్వహించి, ఇస్రో సంస్థ, ఇస్రో శాస్త్రవేత్తలు, సై¯Œ్స అభివృద్ధి చెందాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్రనాయకులు బి.అనంతరావు, నాయకులు బుద్ధా శ్రీనివాస్, వంగలపూడి శివకృష్ణ, యూటీఎఫ్‌ నాయకులు వెంకట్రావు, రామ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఈశ్వరరావు, టి.శివదుర్గ, శివ, భరత్, పెద్దాపురం ఫేస్‌బుక్‌ టీం సభ్యులు ముక్తార్‌ అలీ, హర్ష నెల్లూరి, నీలపాల రవి, డి.క్రాంతికుమార్, అలీ, కాటంరాజు, డి.కృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
     
    ఆల్‌ ద బెస్ట్‌.. 
    కోటనందూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం ప్రయోగించే సీ–37 ప్రయోగం విజయవంతం కావాలని శ్రీసాయి విద్యాసంస్థల అధినేత బి.లక్ష్మి ఆకాంక్షించారు. మంగళవారం విద్యాసంస్థల్లో ఇస్రో ప్రయోగంపై విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రయోగంతో భారతదేశ గొప్పతనం ప్రపంచదేశాలకు తెలియనుందన్నారు. పాఠశాల ఆవరణలో ఈ ప్రయోగానికి సంబంధించి చిత్రాన్ని గీసి అది నింగిలోకి ప్రవేశించే విధానంపై విద్యార్థులకు వివరించారు. సీ–37 ప్రయోగం విజయవంతం కావాలని అధినేత లక్షి్మతో పాటు విద్యార్థులు ‘ఆల్‌ ద బెస్ట్‌’ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    అబ్దుల్‌ కలాంను కలసిన వేళ..
    దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం నేరుగా నేను తయారు చేసిన ప్రాజెక్టు చూసేందుకు వచ్చి సలహాలు ఇవ్వడం జీవితంలో మరువలేనిది. నేను 2024లో మార్చి మూడు నుంచి ఏడో తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన జాతీయ సై¯Œ్స కాంగ్రెస్‌లో సోలార్‌ పెస్ట్‌ కంట్రోల్‌ తయారు చేశా. దానిని చూసిన అబ్దుల్‌ కలాం నన్ను ప్రశంసించారు. కలాం లాంటి మేధావులు ఇస్రోలో ఉన్నారు. ప్రయోగం తప్పకుండా ఫలిస్తుంది. 
    – ఎ.ఇక్వాక్‌వర్మ, శ్రీషిర్డీసాయి విద్యానికేత¯ŒS, రాజమహేంద్రవరం
     
     
    పందలపాక విద్యార్థుల అభినందనలు
    పందలపాక(బిక్కవోలు) : మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష విజేతగా నిలవాలని పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇస్రో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ప్రపంచదేశాలకు దీటుగా ప్రయోగం సఫలం కావాలని, ఇస్రో జయహో అంటూ  పీఎస్‌ఎల్‌వీ–సీ37 అనే అక్షరరూపంలో విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డీవీవీఎస్‌ఎ¯ŒS మూర్తి, సై¯Œ్స ఉపాధ్యాయుడు ఎస్‌ రమేష్, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు, వ్యాయామ ఉపాధ్యాయుడు దార్వంపూడి యువరాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు