ఘనంగా జగన్‌ జన్మదిన వేడుకలు

22 Dec, 2016 00:13 IST|Sakshi
ఘనంగా జగన్‌ జన్మదిన వేడుకలు

-  పలుచోట్ల సేవా కార్యక్రమాలు
బద్వేలు అర్బన్‌:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం  పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక  సుమిత్రానగర్‌లోని షాలోమ్‌ అనాథ శరణాలయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లల నడుమ కేక్‌ కట్‌చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ జనహృదయ నేతగా నిలిచారన్నారు. ఇది సహించలేని  టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజల మనసుల్లో ఆయన స్థానం అలాగే కొనసాగుతుందన్నారు. అలాగే 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. అలాగే స్థానిక మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో కలసపాడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో  వృద్ధులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌ సింగసాని గురుమోహన్, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ సుందర రామిరెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు  అందూరి రామకృష్ణారెడ్డి, సింగసాని శివయ్య, కొండుశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ గోపాలస్వామి, చిన్నకేశంపల్లె సింగిల్‌విండో అ«ధ్యక్షుడు చిన్నపోలిరెడ్డి, సర్పంచ్‌ జయసుబ్బారెడ్డి,  మున్సిపాలిటీ కన్వీనర్‌ కరిముల్లా,  గోపవరం మండల అ«ధ్యక్షురాలు సరస్వతమ్మ, నాయకులు పుత్తా శ్రీరాములు, రాజగోపాల్‌రెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, యద్దారెడ్డి, బాలాజీ శ్రీను,కేశవరెడ్డి, మాధవరెడ్డి, వెంకటరత్నం, రఘురామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, మాధవరెడ్డి, సాంబశివారెడ్డి,  శేఖర్‌రెడ్డి, ఎస్‌ఎం. షరీఫ్, సుబ్బరాయుడు యాదవ్, బిజ్జం రమణ, ఆకుల శివ, నాగేశ్వరరావు, కుప్పాల రమణ,  మురళి, సిద్దయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు