దేశంలో మంచిరోజులు కనిపించడంలేదు: కన్హయ్య

24 Mar, 2016 18:47 IST|Sakshi
దేశంలో మంచిరోజులు కనిపించడంలేదు: కన్హయ్య
విజయవాడ : వేముల రోహిత్ పోరాటాన్ని తాము కొనసాగిస్తామని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ ఐవీ ప్యాలెస్లో గురువారం జరిగిన యువజన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్హయ్య కుమార్ మాట్లాడుతూ... ఈ దేశంలో మంచిరోజులు కరువయ్యాయి. దళితులకు రక్షణ లేకుండా పోయింది. చదువు కోసం దళితుడు పోరాటం చేయాల్సి వస్తోంది.  రోహిత్ చట్టం కోసం పోరాటం చేస్తాం. దేశాన్ని హిందూ రాజ్యం  చేస్తామంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులో మాట చెబుతారు కానీ, ప్రజల మనసులో మాట వినరు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి. నల్లధనం తెస్తామన్నారు. అది ఏమైంది?  ఓ వైపు నిత్యావసర ధరలు మండిపోతుంటే...బుల్లెట్ ట్రయిన్ తెస్తామంటున్నారు. ఇప్పుడు అభివృద్ధిని వదిలేసి మందిర నిర్మాణం  అంటున్నారు. పేదల సబ్సిడీలు తగ్గించి పెద్దోళ్లకు రాయితీలు ఇస్తున్నారు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను దోపిడీ చేసే యత్నం చేశారు. నేతల సొమ్ముతో కాదు.. జేఎన్యూ ఈ దేశ ప్రజల డబ్బుతో నడుస్తోంది' అని అన్నారు.
మరిన్ని వార్తలు