కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలి

24 Sep, 2016 23:13 IST|Sakshi
 
  •  జేసీ రాంకిషన్‌
జడ్చర్ల టౌన్‌ : కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలని, సానుకూల ధక్పథంతోపాటు సంఘటితంగా ముందుకు సాగితే పాలమూరు జిల్లా రూపురేఖలు మారతాయని జేసీ రాంకిషన్‌ అన్నారు. శనివారం జడ్చర్ల బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవ వేడుకలతోపాటు, పాలమూరు జిల్లా సాహితి వికాసం సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరువు, వలసలు, లేబర్‌ జిల్లాగా పాలమూరును వర్ణించటం సబబు కాదని, అలా ఎందుకు మారిందని ఆలోచించాలన్నారు. విద్య, వైద్యంలో వెనకబడిపోవటం వల్లే పాలమూరు అభివద్ధి కుంటుపడిందని, అక్షరాస్యత శాతం పెరిగితేనే వనరుల సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అందుకే బాగా చదువుకుని మీరే మార్పు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పత్రికల్లోనూ నెగెటివ్‌ వార్తలు కాకుండా పాజిటివ్‌ వార్తలు వ్రాయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఎంతో అనుకూలమైన జిల్లాగా పాలమూరు ఉందని, ఏడాదికిందట పారిశ్రామిక వేత్తలతో కొత్తురూలో సమావేశం నిర్వహించగా ఊహించినదానికన్నా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించిన ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర ్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఎన్‌ఎస్‌ఎస్‌ డే సందర్భంగా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ భక్తవత్సల్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ అనంత్‌రెడ్డి, కార్యదర్శి నటరాజ్, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు విశ్వనాథం, సభ్యులు ప్రవీణ్‌కుమార్, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు తమ్మిరెడ్డి, అశోక్‌కుమార్, జ్యోతి, ప్రియాంకలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు