‘ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యనందించాలి’ | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యనందించాలి’

Published Sat, Sep 24 2016 11:07 PM

రికార్డులను పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశీలన బందం సభ్యులు - Sakshi

కోటపల్లి(చెన్నూర్‌) : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపా«ధ్యాయులు విద్యార్థులకు విద్యనందించాలని రాష్ట్ర పరిశీలన బందం సభ్యులు మల్లేశం, సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలలను వారు శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల విషయ పరిజ్ఞానం, మధ్యాహ్న భోజన నిర్వహణ, హాజరు పట్టికలను తనిఖీ చేశారు.
     ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని సూచించారు.  పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లను విద్యార్థులకు అర్థం అయ్యేరీతిలో బోధించాలని తెలిపారు. వారి వెంట ఎంఈవో జగన్, ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement