వేదాలతోనే జ్ఞాన వికాసం

28 Aug, 2016 23:07 IST|Sakshi
వేదాలతోనే జ్ఞాన వికాసం
 
ప్రతి జిల్లాలో వేద పాఠశాలలు ఉండాలి
ప్రముఖ పండితుడు శ్రీరామశర్మ
సామర్లకోట: వేదాలతోనే జ్ఞాన వికాసానికి అవకాశం ఉంటుందని ప్రముఖ వేదపండితుడు చిఱా<వూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. పంచారామ  క్షేత్రమైన శ్రీకుమారరామ భీమేశ్వరాలయంలో శ్రీ బాలత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 18వ వేదసభకు శర్మ అధ్యక్షత వహించారు. వేదాల ద్వారా సృష్టిలోని ప్రతి అంశాన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వేద స్వస్తి నిర్వహించడం వలన ఆయా ప్రాంతాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. వేదాలలోని మహిమలను, వేద సంరక్షణావశ్యకతను వివరించారు.  వేదాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడానికి ప్రతి జిల్లాలో ఒక వేద పాఠ శాల ఉండాలన్నారు. దువ్వూరి లక్ష్మణ ఘనపాఠి, సర్వేశ్వర ఘనపాఠిల పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 125 మంది వేద పండితులు ‘చతుర్వేద పారాయణ,  వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం పండితులను నిర్వాహకులు సత్కరించారు. పరిషత్తు నిర్వాహకులు డాక్టర్‌ చందలాడ అనంతపద్మనాభం, పసల పద్మరాఘవరావు, సింగవరపు సాయిబాబు, గ్రంధి రామకృష్ణ, పాలకుర్తి ప్రసాద్, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌ కంటే బాబు తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు