టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం

28 Aug, 2017 10:05 IST|Sakshi
టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం

కోమటిలంకలో చెరువుల తవ్వకంపై ఫిర్యాదు
లోక్‌ అదాలత్‌లో కోమటిలంక వాసుల పిటీషన్‌
కలెక్టర్‌తో సహా పలువురు
జిల్లా అధికారులు ప్రతివాదులు


ఏలూరు రూరల్‌:
ఏలూరు మండలం కోమటిలంక వాసులు న్యాయపోరాటం మొదలుపెట్టారు. అధి కారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు కొల్లేరులో చేపట్టిన అక్రమ చెరువుల తవ్వకాలను అడ్డుకునేందుకు లోక్‌ అదాలత్‌ తలుపు తట్టారు. గ్రామానికి చెందిన జైభీమ్‌ సంక్షేమ సంఘం సభ్యులు ఈనెల 21న లోక్‌ అదాలత్‌లో పిటీషన్‌ వేశారు. కలెక్టర్‌ భాస్కర్‌తో పాటు ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావు, ఏలూరు తహసీల్దార్‌ కేవీ చంద్రశేఖర్‌తో పాటు అటవీ, మైన్స్, ఫిషరీస్, విజిలెన్స్‌ జిల్లా అధికారులను సైతం ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏలూరు మం డల టీడీపీ అధ్యక్షుడు నేతల రవి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుత్తా కాశీబాబు, శ్రీపర్రు టీడీపీ నాయకుడు సైదు గోవర్దన్‌ అక్రమ చెరువుల తవ్వకాలకు సూత్రధారులని వివరిం చారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా తమ భూముల్లో చెరువులు తవ్వుతున్నారని న్యాయమూర్తి కె.శైలజ వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు పోలీసు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
కోమటిలంక పరిధిలో సుమారు 1,000 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. ఎన్నోఏళ్లుగా గ్రామస్తులు ఈ భూమిలో చేపల సాగు చేసుకుని జీవిస్తూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి పట్టాలు ఇప్పిస్తామని నమ్మిం చారు. దీనికి బదులుగా గతంలో గ్రామస్తులు సాగుచేసిన సర్వే నంబర్‌ 16 నుంచి 30 వరకూ ఉన్న సుమారు 36 ఎకరాల గ్రామంలోని రెవెన్యూ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పలువురిని ఒప్పించారు. దీనిని భూమిలేని జై భీమ్‌ దళిత సంఘం సభ్యులు వ్యతిరేకించారు. ఇవేమీ పట్టించుకోని టీడీపీ నాయకులు యథేచ్ఛగా చెరువు తవ్వకాలు మొ దలుపెట్టారు. అ డ్డుపడ్డ సభ్యులపై టీడీపీ నా యకులు పోలీసు కేసులు పెట్టించారు. గత్య ంతరం లేక సంఘం సభ్యులు రెవెన్యూ, పో లీసు, అటవీ అధికారులతో పాటు కలెక్టర్‌ భా స్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పం దించిన కలెక్టర్‌ రెవెన్యూ భూమిలో తవ్వకాలు అడ్డుకోవాలంటూ ఆదేశించారు. అయినా పనులు సాగిపోయాయి. కొద్దిరోజుల్లో చెరువులో నీ రుపెట్టి చేపల సాగు ప్రారంభించనున్నారు. దీం తో దళితులు లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించారు.

పట్టాలు ఇప్పిస్తామన్నారు
ఎంతోకాలంగా చేపల సాగు చేసుకుని బతుకుతున్నాం. మా భూములకు పట్టాలు ఇప్పిస్తామని నాయకులు చెప్పారు. దీనికి బదులుగా భూమి తీసుకున్నారు. ఇప్పటివరకూ పట్టాలు ఇప్పించలేదు సరికదా పేదలకు చెందిన భూమి తీసుకున్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం. – తెనాలి దానియేలు, సంఘం సభ్యుడు

టీడీపీ నాయకుల కుట్ర
టీడీపీ నాయకులు పేదలను మోసం చేసి భూమి కాజేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. పోలీసు కేసులు బనాయించారు. రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ అధికారులతో పాటు చివరగా జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం. అందరూ న్యాయం మా పక్షాన్నే ఉందన్నారు. చర్యలు మాత్రం తీసుకోలేదు. అందుకే లోక్‌ అదాలత్‌ ఆశ్రయించాం. – మద్దుల రత్నయ్య, జైభీమ్‌ సంఘం అధ్యక్షుడు

>
మరిన్ని వార్తలు