భాషా పండితులకు శుభవార్త

3 Aug, 2016 18:46 IST|Sakshi
  •  పదోన్నతులకు ఉత్తర్వుల జారీ
  • మురళీనగర్‌ : భాషా పండితుల ఆశలు ఎట్టకేలకు నెరవేరాయి. దశాబ్దాలుగా తమ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతున్న వీరికి మోక్షం కలగనుంది. భాషాపండితుల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ 144వ నంబరు ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసినట్లు రాష్ట్ర పండిత పరిషత్‌ పూర్వ కార్యదర్శి డాక్టర్‌ బి.గోవిందనాయడు తెలిపారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా 1450 భాషాపండిత పోస్టులతో పాటు 1250 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి గ్రేడ్‌–1హోదా కల్పిస్తారు. అంటే వీరికి స్కూల్‌ అసిస్టెంటుగా పదోన్నతి కల్పిస్తారు. వాస్తవానికి జిల్లాలో గ్రేడ్‌–2 తెలుగు 1200, హిందీ–800, విజయనగరం జిల్లాలో గ్రేడ్‌–2 తెలుగు 1200 మంది, హిందీ 800 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా ఇదే సంఖ్యంలో భాషా పండితులు ఉన్నారు. ఒడిశా బోర్డర్‌లో ఒరియా, కొన్ని పాఠశాలలో సంస్కతం భాషా ఉపాధ్యాయులు గ్రేడ్‌–2 పోస్టులో పనిచేస్తున్నారు. 
     
    వీరికి కూడా పదోన్నతి కల్పిస్తారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 100–150 మందికి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80–90 మంది భాషా పండితులకు గ్రేడ్‌–1 క్యాడర్‌ లభిస్తుంది. మిగతా పోస్టులను దశల వారిగా భర్తీ చేస్తారు. ఫీడర్‌ క్యాడర్‌లో గ్రేడ్‌–2భాషా పండితులుగా నియమితులైనవారికి మాత్రమే గ్రేడ్‌–1 పదోన్నతి లభిస్తుందని గోవిందనాయుడు చెప్పారు. ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు