ఆ విషయంలో థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నా: సమంత | Samantha Teams Up With Marvel Studios Diwali Surprise To Fans - Sakshi
Sakshi News home page

Samantha: ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా: సమంత

Published Fri, Nov 3 2023 7:08 PM

SAMANTHA TEAMS UP WITH MARVEL STUDIOS DIWALI SURPRISE TO FANS  - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్‌తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.  తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో  సమంత స్పెషల్‌గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్‌ నవంబర్ 10న ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్‌టైనర్‌ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement