గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

2 Oct, 2016 22:59 IST|Sakshi
గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

ప్రొద్దుటూరు:    స్థానిక మైదుకూరు రోడ్డులోని టీవీఎస్‌ షోరూం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మైస్టోన్‌ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీని సినీనటుడు శ్రీకాంత్‌ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిశ్రమల వల్ల గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం  సంతోషంగా ఉందని చెప్పారు.   ఫ్యాక్టరీని స్థాపించిన రామాంజనేయరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ మేనేజర్‌ శేషుబాబు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ ఎ.విజయలక్ష్మి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి దేవానంద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టీడీపీ నాయకుడు ఇవి.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యగా 30 మంది సిబ్బందితో  బందోబస్తు ఏర్పాటు చేయగా రాయల్‌కౌంటీ నుంచి శ్రీకాంత్‌ ఫ్యాక్టరీ వద్దకు రాగానే తోపులాట జరిగింది.  ఓ పోలీసు అధికారి కిందపడ్డాడు. రూరల్, అర్బన్‌ సీఐలు ఓబులేసు, సుధాకర్‌రెడ్డిలతోపాటు ఎస్‌ఐలు చలపతి, మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు