న్యాయమూర్తిపై దాడి

28 Jun, 2016 21:04 IST|Sakshi
-ఎనిమిది మంది న్యాయవాదులపై కేసు.. 14 రోజుల రిమాండ్
వరంగల్: హైకోర్టు విభజన చేయాలని కోరుతూ వరంగల్ జిల్లాకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేశారు. వరంగల్ కోర్టులోని న్యాయవాదులంతా సామూహికంగా మొదటి అదనపు కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. అక్కడ కోర్టు హాలులో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం మూకుమ్మడిగా మొదటి అదనపు జిల్లా జడ్జి కేవీ నర్సింహులులో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆయనపై దాడికి దిగారు. ఈ మేరకు న్యాయమూర్తి నర్సింహులు సుబేదారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

న్యాయవాదులు రంజిత్, శ్యాంకృష్ణ, రాజేంద్రప్రసాద్, అంబటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, రమణ, తీగల జీవన్‌గౌడ్, అఖిల్‌,పాషాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతం వారిని మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనిత ముందు హాజరు పర్చగా, 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు ఎనిమిది మంది న్యాయవాదులను సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరళించారు. 
మరిన్ని వార్తలు