న్యాయశాఖ సిబ్బందికి క్రీడలు ప్రారంభం

20 Jan, 2017 23:35 IST|Sakshi
న్యాయశాఖ సిబ్బందికి క్రీడలు ప్రారంభం
 
 గుంటూరు లీగల్‌: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు శారీరక దృఢత్వానికి ఉపయోగ పడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. సుమలత అన్నారు. జిల్లా న్యాయశాఖ సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడలను  శుక్రవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో ఆమె ప్రారంబించారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కబడ్డీ కోర్టును తొలుత ఆమె రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించి మట్లాడుతూ   ఉభయ రాష్ట్రాల్లో  గుంటూరు జిల్లాలోనే న్యాయశాఖ సిబ్బందికి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల నిర్వహణకు జిల్లాకోర్టు పరిపాలనాధికారి విజయకుమార్, ఇతర న్యాయశాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.    అనంతరం  ఫ్లడ్‌ లై ట్‌ల వెలుగులో  మొదట æనిర్వహించిన కబడ్డీ పోటీలో డీ. రాజశేఖర్‌ జట్టు, జి. వీరారెడ్డి జట్లు తలపడ్డాయి.  చివరిదాకా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజశేఖర్‌ జట్టు 11 పాయింట్ల తేడాతో వీరారెడ్డి జట్టుపై విజయం సాధించింది. క్రీడాపోటీలకు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఒ.వి. నాగేశ్వరరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. లక్ష్మీనరసింహారెడ్డి, ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి పి.  గోవర్ఢన్, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది హాజరయ్యారు. 
 
>
మరిన్ని వార్తలు