విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టులు

4 Aug, 2016 00:54 IST|Sakshi
హన్మకొండ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్‌ కో ర్టులు నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదిక చైర్మన్‌ కందుల కృష్ణయ్య తెలిపారు. విద్యుత్‌ వినియోగదారు లు ఎదుర్కొంటున్న సమస్యలను లోకల్‌ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాలో వచ్చే హెచ్చుతగ్గులు, అంతరాయాలు,  మీటర్, బిల్లులోని సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణను ఈ కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 8న స్టేషన్‌ఘన్‌పూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో, 10న కురవి సబ్‌డివిజన్‌ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు లోకల్‌ కోర్టులు నిర్వహించనున్నట్లు వివరించారు.  
>
మరిన్ని వార్తలు