లోవకు పోటెత్తిన భక్తులు

31 Jul, 2016 22:03 IST|Sakshi
లోవకు పోటెత్తిన భక్తులు
  • 25 వేల మంది రాక  
  • రూ. 5.21 లక్షల ఆదాయం
  • తలుపులమ్మ లోవ (తుని ) :
    ఆషాఢమాసం ఆఖరి ఆదివారం లోవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే భక్తులు వాహనాల్లో రావడంతో తుని మండలం జగన్నాథగిరి నుంచి తలుపులమ్మ కొండపై వరకు రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఈఓ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. అన్ని విభాగాల ద్వారా రూ.5. 21 లక్షల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు.
    ట్రాఫిక్‌ కష్టాలు :
    లోవకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. టోల్‌గేటు నుంచి అమ్మవారి కొండ దిగువ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుని రూరల్‌ ఎస్సై పర్యవేక్షణ లో పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.
     
మరిన్ని వార్తలు