జీహెచ్ఎంసీలో మేజర్‌ రోడ్ల విభాగం రద్దు

5 Oct, 2016 21:31 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో మేజర్‌ రోడ్ల విభాగాన్ని రద్దు చేశారు. ఈ విభాగంలో పనిచేస్తున్న ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలతో సహా దాదాపు 25మంది ఇంజినీర్లను ఇతర విభాగాల్లో నియమించనున్నారు. గత సంవత్సరం ఎన్నికల ముందు నగరంలోని ప్రధాన రహదారుల పనుల్ని త్వరితంగా పూర్తిచేసేందుకు మేజర్‌ రోడ్ల విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దాదాపు రూ.300 కోట్ల మేర పనుల్ని ఆ విభాగం పూర్తిచేసింది. తాజా పరిస్థితులు, అవసరాల దృష్ట్యా దాన్ని రద్దు చేసినట్లు తెలిసింది.

మేయర్‌ తనిఖీలు..
నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.  నగరంలో దాదాపు 190కి పైగా ప్రత్యేక బృందాలతో పెద్దఎత్తున రోడ్ల మరమ్మతుల పనులు చేస్తున్నారు. కాప్రా సర్కిల్‌లో పనుల తీరును ఆయన పరిశీలించారు.

మరిన్ని వార్తలు