ఉత్తర తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు

12 Jul, 2016 15:39 IST|Sakshi

విశాఖపట్నం : ఉత్తర తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. అలాగే అల్పపీడన ప్రాంతంలోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మంగళవారం, బుధవారం ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. కోస్తాతీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

 

మరిన్ని వార్తలు