బయ్యారం అడవుల్లో తుపాకుల మోత

25 Oct, 2015 03:37 IST|Sakshi

పోలీసులు, న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) మధ్య కాల్పులు
 
 బయ్యారం: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి పంచాయతీలోని పందిపంపుల సమీప అడవుల్లో శనివారం సాయంత్రం తుపాకుల మోత మోగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాం దోళనలకు గురయ్యూరు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన వరంగల్-ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్, కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి సాగర్ దళాలు సమీప గ్రామాల ప్రజలతో అటవీప్రాంతంలో సమావేశం అయ్యూయి. అనంతరం దళాలు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకొన్నాయి. నక్సల్స్ దళాలు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నాయి.

దీంతో పోలీసులు సంఘటనా స్థలి సమీప గ్రామాలకు చెందిన పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా నక్సల్స్ ఎజెండాను అమలు పరుస్తున్నామంటున్న ప్రభుత్వం నక్సల్స్‌పై పోలీసులతో కాల్పులు జరపించడం తగదని చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.

మరిన్ని వార్తలు