నా మాటే వేదం | Sakshi
Sakshi News home page

నా మాటే వేదం

Published Sun, Oct 25 2015 7:56 PM

నా మాటే వేదం - Sakshi

 సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మినహా కాంగ్రెస్ పార్టీలో మరెవరైనా సరే ‘నా మాటే వేదం. నేను చెపితే...అంతే’ అని ఎవరైనా అనగలరా. ఇటీవల గాంధీభవన్‌లో పది మంది యువజన కాంగ్రెస్ నేతలు కలిసి ప్రైవేట్ సంభాషణలు చెప్పుకుంటుంటే సీనియర్ కాంగ్రెస్ నేత ఆ హాల్‌లోకి అడుగుపెట్టారు. అంతే అందరూ ఆశ్చర్యచకితులై లేచి నిలబడి నమస్కారం చేసి కూర్చోమని సీటు చూపించారు. ‘అరే మీరేందిరా బై...మీరంతా ఇప్పుడు యువజన కాంగ్రెస్ అని గోల గోల చేస్తుండ్రు...నేనెవరో తెలుసు రా బై మీకు’ అని ప్రశ్నించారు. అదేందన్నా మీరు మాకు తెల్వకపోవడమేంటని వారు నోరెళ్లబెట్టినంత పని చేస్తే ‘అరే బేవకూఫ్‌లారా బై మీరు (కొంచెం చనువుగా) నేను అంటున్నది నా గురించి కాదురా బై...నేను యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పటి సంగతి చెపుతున్నా’ అన్నారు.
 
 సరే చెప్పండన్నా అని అందరూ తలూపారు. ఇక చెప్పేడిదేముంది...అప్పట్లో అన్న ఎంత చెపితే అంత...ఏమనుకుంటుర్రా బై ఇవ్వాళ గులాం నబీ ఆజాద్ అంత పెద్దమనిషికి నేను పెద్దపెద్దోళ్ల అప్పాయింట్‌మెంట్ ఇప్పించిన...ఎందరినో ఢిల్లీలో రాజీవ్‌గాంధీని కలిపించిన. వాళ్లేమో ఏకంగా ముఖ్యమంత్రులైపోయిండ్రు...అరే తమ్మి గిదంతా ఎందుకు చెపుతున్నా అంటే సీనియర్లు అంటే గౌరవమియ్యాలే...మీకేమో గది పట్టదు...మీకు చెపితే అర్థం కాదు గానీ....ఢిల్లీ ముచ్చట్లు...నేనెంత చెపితే అంతరా బై...అని ముక్తాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారట.

Advertisement
Advertisement