విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కరపత్రాల కలకలం

12 Aug, 2016 08:14 IST|Sakshi

విశాఖపట్నం:  విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం పెదవలస గ్రామంలో మావోయిస్టుల పేరిట శుక్రవారం బ్యానర్లు వెలిశాయి.  అటవీ ప్రాంతంలోని సంపద కాజేయటానికి ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట పోలీసులు, ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఏజెన్సీలో అరాచకం సృష్టిన్నారని మావోయిస్టులు కరపత్రాల్లో ఆరోపించారు. జీకే వీధి పరిధిలోని పలు గ్రామాల్లో ని కాఫీ తోటలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు.

లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టులు హెచ్చరించారు. చాపరాతిపాలెం ఎర్రమట్టి క్వారీని మూసివేయకపోతే గడుతూరి బాలయ్య, జి.శంకర్, జి.మురళి తదితరులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు స్పష్టం చేశారు. దీంతో జీకే వీధి మండలంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా పేరిట బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి.

మరిన్ని వార్తలు