రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి

11 Oct, 2016 02:13 IST|Sakshi
రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి
 
  •  మంతి నారాయణ
నెల్లూరు, సిటీ:
ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లో సోమవారం పోలీస్‌, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్‌ అధికారులతో సమీక్షించారు. పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 
పార్కింగ్‌ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. గంధమహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు.
4 లైన్‌ రోడ్డును త్వరతిగతిన ప్రారంభించండి 
నగరంలోని పాతచెక్‌పోస్ట్‌ నుంచి నాలుగోమైలు రోడ్డు వరకు నాలుగు లైన్‌ల రోడ్డును నిర్మించేందుకు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్‌ అజీజ్, కమిషనర్‌ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు