అదృశ్యమైన వ్యక్తి హత్య

14 Dec, 2016 23:12 IST|Sakshi
అదృశ్యమైన వ్యక్తి హత్య
రెండు నెలల అనంతరం 
నిందితుల లొంగుబాటు
ఆధారాలు సేకరించిన పోలీసులు
మాట్లాడడానికి పిలిచి ఘాతుకం
మలికిపురం : మండలంలోని లక్కవరం గ్రామంలో  రెండు నెలల క్రితం అదృశ్యం అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు.  గడచిన  అక్టోబరు 8వ తేదీన గ్రామానికి చెందిన కందికట్ల ఇమ్మాన్యుయేల్‌ (53) అదృశ్యం అయినట్లు అదే నెల పదో తేదీన కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఘటనలో తమ ప్రమేయం ఉన్నట్లు లక్కవరం గ్రామానికి చెందిన కాండ్రేగుల గ్లోరీ (అలియాస్‌ నక్కా గ్లోరి), విశ్వేశ్వరాయపురం గ్రామ శివారులోని కత్తిమండ గ్రామానికి చెందిన నల్లి జ్యోషి ప్రసాద్‌  బుధవారం   పోలీసులకు  వద్ద లొంగి పోయినట్లు సీఐ క్రిస్టోఫర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల  ప్రకారం గ్లోరీ, ఇమ్మానియేల్‌ల మధ్య  స్థానిక చర్చి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గ్లోరీని ఇమ్మానియేల్‌ మానసికంగా వేధించేవాడని చేసేవాడని,  దీంతో గ్లోరీ తన స్నేహితుడైన జ్యోషి ప్రసాద్‌ సాయంతో పథకం ప్రకారం ఇమ్మానియేల్‌ను  పిలిచి  మండలంలోని విశ్వేశ్వరాయపురం– కత్తిమండ సరిహద్దులోని మామిడి తోటలో హతమార్చారని సీఐ తెలిపారు. జ్యోషి ప్రసాద్‌ లక్కవరం గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంపౌండర్‌గా పని చేస్తున్నాడు.  ఇద్దరూ కలిసి ఇమ్మానియేల్‌ మృత దేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకు వచ్చి వెనుక గల చెరువు గట్టున ఆసుపత్రి వ్యర్ధాలు వేసే చెత్త కుండీలో వేసి దగ్దం చేశారు.  అనంతరం వారిరువురూ అదృశ్యమై బుధవారం  పోలీసుల వద్ద లొంగి పోయారు. దీంతో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  లక్కవరంలోని ఆసుపత్రి వెనుక  భారీ చెత్త కుండీని పొక్లెయిన్తో‌  వెలికి తీసి  ఇమ్మానియేల్‌ పుర్రె,  ఎముకలు, సెల్, కళ్ల జోడు స్వాధీనం చేసుకున్నారు.   
మరిన్ని వార్తలు