వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

3 Jan, 2017 03:51 IST|Sakshi
వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

► అభ్యర్థుల ఖర్చుపై నిఘా, ఇకపై లెక్కలు చెప్పాలి
►ఎన్నికల ఖర్చు నిర్ణయించాలని కేంద్రానికి ప్రతిపాదన
►2019 ఎన్నికల్లో ఓటేస్తే గుర్తు కనిపిస్తుంది
►తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌


బి.కొత్తకోట/కదిరి: ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతా యని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి మార్చి మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై లోపాలున్నట్టు ఆరోపణలు రావడంతో వాటిని సరిచేశామన్నారు. ప్రస్తు త ఎన్నికల్లో అభ్యర్థులు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపె ట్టినా, ఓటుకు నగదు ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మాదిరే ఎన్నికల వ్యయం ఎంత అన్నది నిర్ణయించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపామన్నారు. 2019 ఎన్నిక ల్లో ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటర్‌ వెరిఫి యబుల్‌ పేపర్‌ ట్రయల్‌)లను అమర్చు తామని చెప్పారు. దీంతో ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తు కనిపిస్తుందని చెప్పా రు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తులు చేసు కున్నారని, మొత్తం 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఈనెల 6న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. వీరికి సరికొత్త రంగుల గుర్తింపు కార్డులను జారీ చేస్తు న్నట్టు చెప్పారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సమావే శాల నిర్వహణ, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అంది స్తామన్నారు. 15–17 ఏళ్ల వయస్సున్న విద్యార్థులు డ్రాయింగ్‌ పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందితే జాతీయస్థాయిలో పోటీపడే అవకాశం ఉంటుందని, విజేతకు రాష్ట్రపతి బహుమతిని ప్రదానం చేస్తారని వివరిం చారు. ఇలా ఉండగా, సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని సతీసమేతంగా దర్శిం చుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లా డారు. ఓటరుకు ఆధార్‌కార్డు తప్పనిసరా అని ప్రశ్నించగా.. ఇప్పటికే దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించిందన్నారు. తదుపరి నిర్ణయం కూడా కోర్టు ఆదేశాల మేరకే ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు