కుటుంబాన్ని చిధ్రం చేసిన ప్రమాదం

23 Sep, 2016 00:35 IST|Sakshi
  •  ఆదుకోవాలని బాధితుల వేడుకోలు 
  • ముందుకొచ్చిన కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌రావు
  • వరంగల్‌ చౌరస్తా : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. ఊరూరా తిరిగి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిధ్రం చేసింది. కుటుంబ పోషణ భారాన్ని మోసే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, తల్లి  చావుబతుకుల నడుమ చికిత్స పొందుతుండగా, కుమారుడు కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్నాడు. వరంగల్‌లోని 26వ డివిజ¯ŒS బొందిలొల్లిగల్లీ్లకి చెందిన బట్టి జయసింగ్, లక్ష్మి దంపతులు రోజు జిల్లాలోని ఏదో ఒక సంతకు వెళ్లి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చే సొమ్ము తో కాలం వెళ్లదీస్తున్నారు. అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఉల్లిగడ్డలు విక్రయించి తిరిగొస్తుండగా నర్సింహులపేట మండలం దంతాలపల్లి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో జయసింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య లక్ష్మి తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్సపొందుతోంది. వారి కుమారుడు కార్తీక్‌ సింగ్‌ కాలు విరిగి నడువలేని స్థితిలో ఉన్నాడు. ఆర్థిక లేమితో కొట్టుమిట్టడుతున్న కుటుంబం తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తూ ఆదుకునే వారికి కోసం చేతులు జోడించి వేడుకుంటుంది.
    ఆర్థిక సాయం అందించిన గుండా ప్రకాశ్‌రావు
    దుర్భర పరిస్థితిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న కార్తీక్‌ సింగ్‌ను గురువారం టీఆర్‌ఎస్‌ నాయకుడు, స్థానిక కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌ రావు పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. తాత్కాలిక వైద్య ఖర్చుల కోసం రూ.6 వేల ఆర్థిక సాయం అందచేశారు. స్థానికులు, మహానగర ప్రజలు ఆ కుటుంబానికి తమ వంతు సాయం అందించాలని కార్పొరేటర్‌ ప్రకాశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు మబ్బు ప్రవీణ్, సకినాల శ్రీకాంత్, కానుగంటి రామారావు, కొలిపాక శ్రీనాథ్, కర్రె సుదర్శ¯ŒS, మూగ శ్రీను, లావణ్య పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు