అయ్యో.. నందీశ్వరా..

3 Aug, 2016 00:32 IST|Sakshi
అయ్యో.. నందీశ్వరా..
  • జీవకళ కోల్పోతున్న నంది విగ్రహం
  • మండపంపై కప్పు నిర్మించని అధికారులు
  • నందీశ్వరుడిని కాపాడాలని భక్తుల వేడుకోలు
  • వెంకటాపురం : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. నందీశ్వరుడి విగ్రహం రోజురోజుకు జీవకళ కోల్పోతుంది. మండలంలోని పాలంపే ట శివారులో 1213లో కాకతీయులు రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆల య గర్భగుడికి ఎదురుగా నంది మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శివుడి వాహనమైన నందీశ్వరుడి  విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే కాలక్రమేణా నంది మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో 1910లో నిజాం ప్రభుత్వం వి గ్రహాన్ని ప్రధాన ఆలయంలోకి మార్చి రామలింగేశ్వరస్వామికి ఎదురుగా ఏర్పాటు చేసిం ది. దీంతో ఆలయంలోనే భక్తులు 1988 వరకు నందీశ్వరుడిని దర్శించుకున్నారు.
     
    పాతస్థలంలో పునఃప్రతిష్ఠతకు కసరత్తు
    1989లో నందీశ్వరుడి విగ్రహాన్ని తిరిగి పాత స్థలంలోనే పునఃప్రతిష్ఠించాలని పురావస్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కాకతీయులు ఏర్పాటు చేసిన నంది మండపాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా పైకప్పునకు చెందిన శిల్పాలు పూర్తిగా ధ్వంసం కావడంతో అధికారులు వాటిని తొలగించారు. పైకప్పు లేకుండానే నంది మండపాన్ని 1989 డిసెంబర్‌ లో పునరుద్ధరించి నందీశ్వరుడిని అందులో పునప్రతిష్ఠించారు. నూతనంగా పైకప్పు నిర్మిం చేందుకు పురావస్తు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నుంచి స్పందన కరువైందో.. ప్రతిపాదనలు పంపి పురావస్తుశాఖ అధికారులు చేతు లు దులుపుకున్నారో.. తెలియదు కానీ ఇప్పటివరకు పైకప్పు నిర్మాణం జరగలేదు.
     
    కళా సంపద కనుమరుగు
    27 ఏళ్లుగా పై కప్పు నిర్మాణాన్ని పట్టించుకునే వారే కరువవడంతో నందీశ్వరుడు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా డు. జిల్లాలోని అన్ని ఆలయాల్లోని నంది విగ్రహాల కంటే రామప్పలోని నందీశ్వరుడికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మండపం ముందుకు వెళ్లి నందీశ్వరుడిని ఎటు పక్క కు జరిగి చూసిన మనల్ని చూసినట్లుగానే కనిపిస్తుంది. శివుడి వాహనమైన నందీశ్వరుడు ఆయన ఆజ్ఞ వినగానే పరుగెత్తేందు కు సిద్ధంగా ఉన్నట్లు రెండు చెవులు వం చి, ఒక కాలును ముందుకు పెట్టి పిలుపుకోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతటి కళా వైభవం కలిగిన విగ్రహాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో శిల్ప సంపద కనుమరుగవుతున్నాయి. కేంద్ర పురావస్తుశాఖ అధికారు లు తక్షణమే నంది మండపంపై పైకప్పు నిర్మించాలని భకులు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు