రైతులపై నయీం ముఠా జులుం

27 Aug, 2016 23:35 IST|Sakshi
రైతులపై నయీం ముఠా జులుం
తుర్కపల్లి : నయీం అకృత్యాలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బడాబాబులనే బెదిరించి డబ్బుల వసూళ్లు, ఆక్రమణకు పాల్పడిన అతడి ముఠా పేద రైతులపై కూడా జులూం ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది.

‘‘ మేం నయీం భాయ్‌ మనుషులం.. ఈ భూమిని రిజిస్ట్రేషన చేయించుకున్నాం.. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోతారా.. లేకుంటే చస్తారా..? అంటూ బెదిరించారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న కన్నతల్లి లాంటి భూమిని వదిలి మిన్నకుండిపోయామని తుర్కపల్లి మండలం పరిధి పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని సుక్యతండాకు చెందిన భానోత్‌ వాల్య, భానోత్‌ రాములు, భానోత్‌ రవి వాపోయారు. నÄæూమ్‌ బాధితులు న్యాయం కోసం ఫిర్యాదు చేయమని సిట్‌ అధికారులు పిలుపునివ్వడంతో శనివారం వారు తుర్కపల్లి తహసీల్దార్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  సంబంధిత ఫిర్యాదు పత్రాన్ని జిల్లా ఎస్పీకి అందించనున్నట్లు తెలిపారు.

వివరాలు వారి మాటల్లోనే.. సుక్యతండాలోని 302 సర్వే నంబర్‌లో  11.12  గుంటల ఖుష్కి భూమిని మా తాత సోమ్లనాయక్‌ పల్లెపహాడ్‌కు చెందిన పిన్నోజు చంద్రయ్య వద్ద ఖరీదు చేసుకున్నాడు. 90 సంవత్సరాల నుంచి మా తాత వారుసులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పట్లో అవగాహనలేక రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. సాదా దస్తావేజు మీద రాసుకుని భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి రికార్డులో మా తాత వారుసులమే కాస్తుగా ఉంటున్నాం.  పది సంవత్సరాల క్రితం మాకు తెలియకుండా భూమికి సంబంధించిన (రికార్డులో) వారసులు పిన్నోజు ప్రేమ్‌రాజ్,పిన్నోజ్‌ సింహచారిలను తీసుకొని వెళ్లి 13–10–2006లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నయీమ్‌ అనుచరులమని చెప్పి భువనగిరికి చెందిన మహ్మద్‌ ఆరీఫ్, అబ్దుల్‌ నాసర్, మహ్మద్‌ మక్సూద్, మహ్మద్‌ యూనస్‌ మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చే సుకున్న తరువాత వారంతా అదే రాజు అర్ధరాత్రి మా భూమి వద్దకు వచ్చి కడీలు నాటారు. మా పై దౌర్జన్యం చేసి  భూమిని వదిలేస్తారా.. చస్తారా అంటూ బెదిరించారు.

భూమిలోకి ప్రవేశిస్తే చంపుతామన్నారు. మా తాత గారి ఆస్తి వల్ల వారి వారసులుమైన 8 కుటుంబాలు జీవిస్తున్నాయి. పది సంవత్సరాల నుంచి న యీమ్‌ అనుచరులమని చెప్పి మా ఇళ్లపై దాడిచేసి భయానక వాతావరణం సృష్టించారు.  ఈభూమిలోని బోరు, బావి, పొలం అన్ని విడిచి పెట్టి పోవాలని హెచ్చరికలు చేశారు. భూమి కోల్పోయిన తరువాత అప్పులు భారం పెరిగి పోయి 2014 సంవత్సరంలో మా చిన్నాన్న భానోత్‌ పడిత్యా ఉరేసుకుని చనిపోయాడు. మా భూమిని అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి మాకు పట్టదారు పాస్‌పుస్తకాలు అందించాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు