బోధనపై శ్రద్ధ ఏదీ?

19 Jun, 2017 23:32 IST|Sakshi
పదవుల కోసం మంత్రుల  చుట్టూ  ప్రదక్షిణ  
జేఎన్టీయూలో తగ్గిన  ఆవిష్కరణలు, పేటెంట్లు  
 
జేఎన్టీయూ :  పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది జేఎన్టీయూ పరిస్థితి. ఉన్నత విద్యకు దిశానిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు కరవవుతున్నారు. జేఎన్టీయూలో బోధన  సిబ్బంది కొరతగా ఉంది. దీనికితోడు పదవులపై ఉన్న  శ్రద్ధ బోధన, పరిశోధనపై చూపడంలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  జేఎన్టీయూ అనంతపురం పరిధిలో పరిశోధనలు, ఆవిష్కరణలు, పేటెంట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోవడం ఇందుకు ఉదాహరణ.  

తీసికట్టుగా సాంకేతిక విద్య..
జేఎన్టీయూ ఏర్పడి ఇప్పటికి  8 ఏళ్లు  కావస్తోంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం బీటెక్‌ కోర్సులకు 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, పీజీ కోర్సులయితే 12 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు తప్పనిసరి. ఇందులోనూ 1 : 2 : 6 నిష్పత్తిలో బోధనా  సిబ్బంది ఉండాలి. అంటే ఒక ఫ్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌లు బీటెక్‌ కోర్సులకు ఉండాలని నిబంధన. పోçస్తు గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 1 : 1 : 2 నిష్పత్తిలో ఒక ఫ్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ఫ్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఉండాల్సి ఉంది. జేఎ¯ŒSటీయూ ప్రారంభమైన కొత్తలో 72 పోస్టుల భర్తీకి అనుమతి లభించినప్పటికీ 34 పోస్టులను  మాత్రమే భర్తీ  చేశారు.   కొత్తగా ఏర్పడిన కలికిరి కళాశాలకు పోస్టులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన అనుమతులు లేవని నియామకాల పట్ల వర్శిటీ యాజమాన్యం తాత్సారం చేసింది.  బోధన పోస్టుల సంఖ్య ప్రస్తుతం జేఎ¯ŒSటీయూలో 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా 134 ఖాళీలకు అనుమతి లభిం చింది. మొత్తం 214 పోస్టుల భర్తీపై వర్శిటీ యం త్రాంగం ఎప్పుడు భర్తీ చేస్తుందో తెలియని పరిస్థితి. 

పడకేసిన పరిశోధన 
బోధన  సిబ్బంది కొరత వల్ల పీహెచ్‌డీ  కోర్సు చేయాలనుకున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్నవారిలో అదనపు పదవులు ఉన్నా, తరగతులు తప్పనిసరిగా తీసుకొనే వారు కొందరే  ఉన్నారు. అసలు తరగతులు వైపు చూడకుండా అదనపు పదవిలోనే కొనసాగుతున్న అసిస్టెంట్‌ , అసోసియేట్‌ ప్రొఫెసర్లు  ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంటెక్‌ ప్రాజెక్ట్‌లు , పీహెచ్‌డీ ప్రాజెక్ట్‌ థీసిస్‌ అధ్యాపకులు  పరిశీలన చేయడానికి నెలల తరబడి  విద్యార్థులు వేచి ఉండాల్సిన పరిస్థితి.  అయినప్పటికీ  వర్సిటీ యాజమాన్యం చూసిచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. 
మరిన్ని వార్తలు