‘రెవెన్యూ శాఖలో నో గ్రేడింగ్’

11 Mar, 2016 21:21 IST|Sakshi

తెనాలి(గుంటూరు): రెవెన్యూ శాఖలో గ్రేడింగ్ విధానం అమలు చేయటం లేదని, ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చందర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు.

శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలోని ఆర్ అండ్ బీ బంగళాలో అసోసియేషన్ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామానికొక వీఆర్‌వోను కనీసం నియమించాలని, కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ శాఖలో 110 హెచ్‌ఓడీలున్నాయనీ, వాటికి కార్యాలయాలు చూపిస్తే, రాజధానికి వచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు