రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

23 Aug, 2016 00:05 IST|Sakshi
చెల్లా చెదురుగా పడి ఉన్న ద్విచక్రవాహనాలు
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
 
 
నెల్లిమర్ల రూరల్‌ : మండలంలోని గుషిణి – అలుగోలు రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలం చిననాగళ్లవలస గ్రామానికి చెందిన నిద్దాన లక్ష్మున్నాయుడు(38) తన మామయ్య అసిరినాయుడుతో ద్విచక్రవాహనంపై తంగుడుబిల్లి వెళ్తుండగా, అదే సమయంలో గుషిణి గ్రామానికి చెందిన చందక రమణ కూడా ద్విచక్రవాహనంపై అలుగోలు వస్తున్నాడు. సరిగ్గా గుషిణి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురెదురుగా వస్తున్న వీరు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మన్నాయుడు అక్కడికక్కడే మతి చెందగా, చందక రమణ, అసిరినాయుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై హెచ్‌. ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 
హెచ్చరిక బోర్డులు లేకనే..
సతివాడ నుంచి అలుగోలు, గుషిణి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా మలుపులతో కూడుకొని ఉంది. గతంలో కూడా ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సతివాడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి మతి చెందాడు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులు కాని స్పీడ్‌ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మలుపుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు గాని, హెచ్చరిక బోర్డులు గాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు