పంచాంగాలను ఏకీకృతం చేయాలి

8 Apr, 2017 23:10 IST|Sakshi
  • దేవాదాయశాఖ మంత్రికి భీమేశ్వర సిద్ధాంతి వినతి
  • అమలాపురం రూరల్‌ :
    పంచాంగాలను ఏకీకృతం చేయాలని కోరుతూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావుకు బండార్లంక గ్రామానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త కాలేపు భీమేశ్వర సిద్ధాంతి వినతి పత్రం అందించారు. జిల్లాకు వచ్చిన మంత్రిని భీమేశ్వర సిద్ధాంతి కలసి ఈ విషయమై కొద్దిసేపు చర్చించారు. పూజలు, వ్రతాలు, పండుగలు, పుష్కరాలతో పాటు మానవుడు జన్మంచిన లగాయితు మరణ పర్యంతం ఆచరించే అన్ని కార్యక్రమాలకు పంచాగమే ప్రధాన ఆధారమని భీమేశ్వర సిద్ధాంతి గుర్తు చేశారు. అటువంటి పంచాం గాలను పూర్వ పద్ధతిలో కొందరు.. మరో పద్ధతిలో కొందరు గుణించడం వల్ల పండుగలు భిన్న తేదీల్లో వస్తున్నాయన్నారు. ఏ పంచాంగాన్ని అనుసరించాలో తెలియక ప్రజలు ఆయోమయంలో పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది ప్రజల నమ్మకాలను.. విశ్వాసాలను.. భారతీయ సం స్కృతి.. వాటి విలువలను పెంపొందించడానికి ప్రభుత్వాలు కల్పించుకుని పంచాంగాలను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని శాసనం ద్వారా అమలు చేయాలని ఆయన కోరారు.
     
మరిన్ని వార్తలు