హరితహారంలో భాగస్వామ్యం కావాలి

6 Aug, 2016 20:37 IST|Sakshi
మెుక్కలు నాటుతున్న కలెక్టర్‌
  • కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌
  • ఎల్లారెడ్డిపేటలో మొక్కలు నాటిన కలెక్టర్‌
  • ఎల్లారెడ్డిపేట : హరితహారం ద్వారా మండలంలో 40 లక్షల మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అన్నారు. మండలంలోని దేవునిగుట్ట, చింతకుంటతండాల్లో కలెక్టర్‌ మొక్కలు నాటారు. పీఎల్‌డీపీ పథకం ద్వారా ఒడ్డెర కులస్తులకు కేటాయించిన 32 ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకానికి అవసరమైన బోరుమోటార్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఒడ్డెర కులస్తులకు కేటాయించిన భూమిలో పండ్లతోటలు పెంచుకుని జీవనోపాధి పొందాలన్నారు. రూ.6లక్షలతో నాలుగు బోర్లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్‌ అందె సుభాష్, సర్పంచ్‌ నాజీం, ఎంపీటీసీ పెంటయ్య, తహశీల్దార్‌ పవన్‌కుమార్, ఎంపీడీవో చిరంజీవి, ఎంఈవో రాజయ్య, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కొండ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. 

    చెరువు భూములను కబ్జాచేస్తే చర్యలు
    చెరువులను అన్యక్రాంతం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. రాచర్లగొల్లపల్లిలోని గోదుమకుంట చెరువు భూములను కొందరు కబ్జా చేసి పంటలు సాగుచేస్తున్నార ని రైతులు, యువకులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువులను అన్యక్రాంతం చేసేవాళ్లపై క్షేత్రస్థాయిలో విచారణచేసి తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు భూములను కాపాడాలని తహశీల్దార్‌ పవన్‌కుమార్, వీఆర్వో శ్రీనివాస్‌ను ఆదేశించారు. 
>
మరిన్ని వార్తలు