మీ కోసం తపాల పథకాలు

24 Jul, 2016 23:01 IST|Sakshi
మీ కోసం తపాల పథకాలు

అనంతపురం రూరల్‌: గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువయ్యేందుకు తపాల శాఖ మంచి పథకాలను ప్రవేశ పెడుతోంది. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తపాలశాఖ ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం తపాల శాఖ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, అటల్‌ పింఛన్‌ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా, జీవన జ్యోతి వంటి పథకాలు పేద ప్రజల  భవిష్యత్‌కు బాటలు  వేసే పథకాలన్నారు.  ఈ పథకాలకు అర్హులు వీరే

అటల్‌ పింఛన్‌ యోజన
     ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా అర్హులే.. 18– 40సంవత్సరాల లోపు వారు ప్రతి నెల రూ. 42 నుంచి 210వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు ఇందులో ప్రత్యేకంగా మూడు నెలలు, ఆరు నెలలకు ఒక సారి డిపాజిట్‌ చేసుకునే సదుపాయం ఉంది. ముందుగా పోస్టాఫీసులో ఖాతా తెరచి నిర్ధేశించుకున్న మొత్తాన్ని జయ చేయాల్సి ఉంటుంది.  డిపాజిట్‌ చేసుకున్న వ్యక్తికి 65సంవత్సరాలు నిండిన తర్వాత పొదుపు చేసిన మొత్తాన్ని బట్టి  ప్రతి నెల పింఛన్‌ అందుతుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
         ఈ బీమా యోజనలో చేరే వ్యక్తి ముందుగా పోస్టాఫీసులో ఖాతా తెరవాలి. ఈ పథకానికి సంవత్సరానికి రూ. 12చెప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు డిపాజిట్‌ దారుడు  గాయపడితే రూ. లక్ష, ప్రాణాలు కోల్పోతే రూ.2లక్షలు బీమా అందుతుంది. ఈ బీమాకు 18 నుంచి 60సంవత్సరాల వారు అర్హులు.

ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన
        జీవన్‌ జ్యోతి యోజన పథకం జీవిత బీమా పథకం ఈ పథకంలో చేరే వ్యక్తులకు 18నుంచి 50సంవత్సరాల లోపు ఉండి పోస్టాఫీసులో ఖాతా ఉండాలి.  సంవత్సరానికి రూ. 330 చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే రూ. 2లక్షలు అందజేస్తారు.  

సుకన్య సమృద్ధి యోజన
        ఈ పథకం  పదేళ్లలోపు బాలికలకు వర్తిస్తుంది. ఈ ఖాతను రూ. 1000 నుంచి ప్రారంభించి గరిష్టంగా సంవత్సరానికి రూ.1.50లక్షల వరకు చెల్లించ వచ్చు బాలికకు 18ఏళ్లు నిండిన తర్వాత చుదువు, వివాహాం కోసం ఖాతాలోని నిల్వ నుంచి 50శాతం మేర విత్‌ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం బాలికకు 21ఏళ్లు నిండిన తర్వాత మొత్తం డబ్బును చెల్లిస్తారు.  
 

మరిన్ని వార్తలు