వన్యప్రాణులకు రక్షణేది..?

7 Feb, 2017 02:13 IST|Sakshi

పచ్చని చెట్లు.. పారేటి సెలయేళ్లు నడుమ దొరికింది తింటూ హాయిగా జీవనం సాగించే వన్యప్రాణులకు గడ్డుకాలం ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులకు తోడు పెరుగుతున్న జనాభాకు
 అడవుల శాతం క్రమక్రమంగా తగ్గుతోంది. ఉన్న కొద్దిపాటి అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి వసతి లేక జనారణ్యంలోకి అడుగిడుతున్న వన్యప్రాణులు రక్షణ కరువై వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి.

చండూరు :
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, మునుగోడు మండలాల పరిధిలో రెండు వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా నాంపల్లి, మర్రిగూడెం మం డలాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతూ నే ఉంది. ముఖ్యంగా జింకలు, జాతీయ పక్షులైన నెమళ్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి.

రాత్రివేళ వేట..
నియోజకవర్గ పరిధిలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నాంపల్లి, మర్రిగూడ మండలాల సరిహద్దు గ్రామాల్లో ఇటీవల వేటగాళ్లు రెచ్చిపోతున్నారని తెలి సింది.ఓ వైపు అధికారుల నిఘా కొరవడ డం.. మరో వైపు జాతీయ పక్షులు, జిం కలు ఆహారం, దాహార్తిని తీర్చుకునేం దుకు జనారణ్యంలోకి వస్తుండడం వేట గాళ్లకు కలిసొస్తుందని తెలుస్తోంది. కొం దరు ఓ ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో వలల సహాయంతో నెమళ్లను పట్టుకుం టున్నట్టు సమాచారం. ఇటీవల కాలం లో చండూరు మండలంలో మూడు నె మళ్లు ప్రత్యక్షమయ్యాయి. రైతులు వాటి ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అందులో ఒకటి అనుమానాస్పదంగా మృతిచెందింది.  ది రైతుల పొ లాల్లో పురుగు మందు తినడంతోనే మృ తి చెందిందని పోలీసులు ధ్రువీకరించారు.
గతంలో ...
మండలంలో 1999లో గుండ్రపల్లి గ్రామ శివారులో నెమళ్లను తిన్నట్టుగా ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు గ్రామంలో విచారణ కూడా నిర్వహించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కటకటాల పాల్జేశారు. మండలం పరిధిలోని జోగిగూడెం గ్రామంలో 2015లో నెమళ్లను వేటాడి పోగులు వేసుకుని తిన్నారన్న వార్త అప్పట్లో దుమారమే రేపింది. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేశారు. తదుపరి మర్రిగూడెం మండల పరిధిలో కొంత మందిపై కేసు నమోదు చేసి వదిలేశారు.

జాతీయ పక్షులకు రక్షణ లేదు
నియోజకవర్గ పరిధిలో జాతీయ పక్షులకు రక్షణ లేకుండాపోయింది. అడవుల్లో నీరు లేక పోవడంతో బహిరంగ ప్రదేశాల్లోకి వస్తున్నాయి. ఫారెస్ట్‌ అధికారుల నిఘా లేకపోవడంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు.వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి.
 బొబ్బల శ్రీనివాస్‌ రెడ్డి(ఎప్‌ఎస్‌సీఎస్‌)

వేటగాళ్లపై నిఘా
అడవుల్లో నీటి వసతి లేక అప్పుడప్పుడు వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తుంటాయి. ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలో నెమళ్ల సంఖ్య పెరిగింది. వేటగాళ్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. ఎక్కడైనా వన్యప్రాణులను వేటాడితే సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
–వెంకటయ్య, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, మునుగోడు
 

>
మరిన్ని వార్తలు