ప్రొటోకాల్‌పై మంత్రికి ఫిర్యాదు

20 Jun, 2016 08:53 IST|Sakshi
ప్రొటోకాల్‌పై మంత్రికి ఫిర్యాదు

ఖానాపూర్ : పార్టీ కార్యక్రమాలతోపాటు తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎంపీపీగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని, స్థానిక ఎమ్మెల్యే సైతం త నపై కావాలనే వివక్ష చూపిస్తున్నారని ఎంపీపీ ఆకుల శోభారాణి ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనిపై నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లాలోని మంత్రులు, పార్టీ జిల్లా, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు. తనను ఉద్దేశ పూర్వకంగానే ఆహ్వానించడంలేదని దీంతో పార్టీ శ్రేణులో టీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయా అనే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు.

సమాచారం ఇవ్వకుండా మంత్రులు వస్తున్నారని హడావుడి చేసి ప్రజలతోపాటు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలోను సీఎం వస్తున్నారంటూ తరచు హెలిప్యాడ్ స్థల పరిశీలన పేరుతో ప్రకటనలు ఇచ్చారన్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ్జకార్యక్రమంలో నాయకులు దాసరి రాజన్న, లక్కవత్తుల శంకర్, కుంటాల గజేందర్, మ్యాదరి రాజేశ్వర్, బక్కశెట్టి వెంకట్రాములు, నారపాక నర్సయ్య, మగ్గిడి సురేశ్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా