త్వరలో కొత్త ‘రాజధాని’ బస్సులు

12 Dec, 2016 14:57 IST|Sakshi
త్వరలో కొత్త ‘రాజధాని’ బస్సులు

రోడ్లపైకి 95 కొత్త వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ త్వరలో కొత్త ‘రాజధాని’బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 61 రాజధాని (పూర్వపు పేరు ఇంద్ర) బస్సులు తిరుగుతున్నాయి. ఇవన్నీ పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్తగా 95 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిని సమకూర్చుకునే ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతున్నందున త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

సూపర్ లగ్జరీ కంటే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉండటంతో రాజధాని బస్సులకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడపాలని సీఎం కూడా ఆదేశించటంతో వాటి సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. డిమాండ్ ఉన్న దూరపు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు.
 
సూపర్ లగ్జరీలుగా పాత బస్సులు...
పాత రాజధాని బస్సులను సూపర్‌లగ్జరీ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. వాటికి కొత్త బాడీ అమర్చి కొత్త రూపుతో రోడ్లపైకి తేనున్నారు. 

మరిన్ని వార్తలు