‘జి.పుల్లారెడ్డి’కి అరుదైన అవకాశం

22 Dec, 2016 00:15 IST|Sakshi
– డీఎస్‌టీ ఫిస్టు–2016 నిధులు మంజూరు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ) కళాశాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ఫండ్స్‌ ఫర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–2016లో భాగంగా 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్‌ బీ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ. 30 లక్షలు, రెండో విడతలో మరో 30 లక్షల రూపాయలు రానున్నట్లు వివరించారు. ఈ నిధులను సైన్స్‌ పరికరాల కొనుగోలు కోసం  వినియోగించేందుకు వీలుందన్నారు. దేశంలోని అతికొద్ది కళాశాలలకు మాత్రమే ఫీస్టు నిధులు మంజూరవుతాయని, అందులో తమ కళాశాలకు స్థానం లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సంవత్సరమే కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని అర్‌అండ్‌డీ విభాగం సీపీఈ(కాలేజ్‌ విత్‌ పొటెన్సియల్‌ ఎక్సాలెన్స్‌) స్థాయిని ఇచ్చిందని. ఏపీఎస్‌ఎస్‌డీసీ, పీఎంకేవీవై కింద మూడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు మంజరైన విషయం విదితమేనని ఆయన వివరించారు. 
 
మరిన్ని వార్తలు