‘పుష్కర’ నీటి కోసం రైతుల రాస్తారోకో

21 Aug, 2016 00:58 IST|Sakshi
‘పుష్కర’ నీటి కోసం రైతుల రాస్తారోకో
బూరుగుపూడి (మధురపూడి) : సాగునీటి కోసం అన్నదాతలు గొంతెత్తారు. శని వారం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద రెండు గంటల సేపు రాస్తారోకో చేశారు. పుష్కర నీరు విడుదల చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో ఉన్న ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. ఆదివారం రాత్రిలోగా నీరు విడుదల చేయకపోతే, పుష్కర ఎత్తిపోతల పథకం అధికారుల కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించా రు. పథకం ఈఈ పి.వాసుదేవరావు, ఇతర అధికారులతో జక్కంపూడి చర్చిం చారు.  రైతులకు అనుకూలంగా అధికారులు నడచుకోవాలని హితవుపలికారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని మళ్లించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆగస్టులో సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నీటి విడుదలకు ఈఈ హామీ ఇచ్చారు. గుమ్ములూరు, బూరుగుపూడి, మధురపూడి, బుచ్చింపేటల్లోని కెనాల్‌ను ఈఈ పరిశీలించారు. పార్టీ మండల కన్వీనర్‌ ఉల్లి బుజ్జిబాబు, సీతానగరం కన్వీనర్‌ డాక్టర్‌ బాబు, రాజానగరం కన్వీనర్‌ మందారపు వీర్రాజు, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లిన సుధాకర్‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సర్పంచ్‌ కర్రి సూర్యకుమారి, పార్టీ నాయకులు అడబాల సీతారామకృష్ణ, నక్కా రాంబాబు, తోరాట శ్రీను, అడపా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు