సీమ వెనుకబాటుపై చట్టసభల్లో చర్చ జరగాలి

24 Mar, 2017 23:04 IST|Sakshi

–రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ ఓబుళు
అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాయలసీమ వెనుకబాటుపై చట్టసభల్లో చర్చ జరగాలని కోరుతూ రాయలసీమ అభివృద్ధి కమిటీ చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్‌జీఓ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.  కమిటీ కన్వీనర్‌ ఓబుళు మాట్లాడుతూ రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమన్నారు. అమరావతిలో ప్రప్ర«థమంగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఒకరోజు రాయలసీమపై చర్చ జరగాలన్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమకు అవసరమైన సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, నిధులు తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీలను చేశాయన్నారు. వాటిని కార్యచరణలో ప్రకటించలేదన్నారు. రాయలసీమ ప్రాంతానికి కార్యచరణ ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటనరసయ్య, మానవ హక్కుల వేదిక ఎస్‌ఎం బాషా, మానవత తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, సింగమనేని నారాయణ, మాజీ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, డా. వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు