ప్రారంభానికి సిద్ధమైన గోదాంలు

3 Feb, 2017 22:14 IST|Sakshi
ప్రారంభానికి సిద్ధమైన గోదాంలు

►  వేగంగా పూర్తయిన నిర్మాణాలు
► గోదాముల్లో పంటలనిల్వపై రైతుల హర్షం


దహెగాం: రైతులు పండించిన పంటలను ఇళ్లల్లో నిల్వ ఉంచుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగి రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించి పంటలను  నిల్వ ఉంచుకోవడానికి మార్కెట్‌ క మిటీ ఆధ్వర్యంలో గోదాంల నిర్మాణం చేపట్టి ంది. మండలానికి ఒక గోదాం చొప్పున ఒక్కో గోదాంకు రూ. 3 కోట్లు వెచ్చించి  గత సంవత్స రం నిర్మాణాలు ప్రారంభించింది. మార్కెట్‌యార్డు గోదాంల నిర్మాణాలు పూర్తయి అవి నేడు ప్రారంభదశకు చేరుకున్నాయి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పం టలకు గిట్టుబాటు ధరలేనప్పుడు పంటలను గో దాంలో నిల్వ ఉంచి దానిపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటుధర వచ్చిన తరువాత పంటలను విక్రయిస్తారు. మార్కెట్‌ కమిటీ వారు 75 శాతం రుణాన్ని రికవరీ చేసుకుని మిగతా డబ్బులను రైతులకు చెల్లిస్తారు.

నియోజకవర్గంలో వేగంగా నిర్మాణాలు
సిర్‌పూర్‌(టి) నియోజకవర్గంలో సిర్‌పూర్‌(టి), కౌటాల, కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్‌ మండలాల్లో గత సంవత్సరం ఒక్కో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. దహెగాం, కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్‌ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. కాగజ్‌నగర్‌లోని గోదాం పూర్తికాగా రైతులు పండించిన ధాన్యాన్ని అందులో నిల్వ చేస్తున్నారు. సిర్‌పూర్‌(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. దీంతో పండించిన పంటల «ధాన్యాన్ని గోదాంలలో నిల్వ ఉంచుకోవచ్చని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

75 శాతం రుణం పొందే అవకాశం
రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పంటలను గోదాం లలో నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ ఉంచిన పం టలకు మార్కెట్‌కమిటీ వారు తక్కువ అద్దెను నిర్ణయిస్తారు. మార్కెట్‌లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు గోదాం లో నిల్వ ఉంచిన పంటలపై 75 శాతం రుణం పొందే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర వచ్చి న తరువాత రైతు పంటను విక్రయించి మార్కె ట్‌ కమిటీ ద్వారా తీసుకున్న 75 శాతం రుణం రికవరీ చేసుకుంటారు. మిగతా డబ్బులను రై తులకు అందజేస్తారు. రైతులకు లాభం చే కూర్చే దిశగా గోదాంలు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీసాగులో వచ్చిన పంటలను గోదాంలలో నిల్వ చేసుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద రైతులు అన్ని పంటలను నిల్వ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం
సిర్పూర్‌(టి) నియోజకవర్గంలో పూర్తయిన గోదాంలను త్వరలో ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. దహెగాం, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్‌ మండలాల్లో గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. సిర్పూర్‌(టి) మండలంలోని గోదాం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెలరోజుల్లో నిర్మాణం పూర్తికానుంది. పూర్తయిన గోదాంలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుబంధు పథకం కింద రైతులు పండించిన పంటలను గోదాంలో నిల్వచేసుకోవచ్చు. – సాయిరాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఏఈ

మరిన్ని వార్తలు