ద్రవ్యోల్బణం, ఫెడ్‌ మినిట్స్‌పై ఫోకస్‌

14 Aug, 2023 06:12 IST|Sakshi

తుది దశ క్యూ1 ఆర్థిక ఫలితాలపై దృష్టి

మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు

పరిమిత శ్రేణిలో స్థిరీకరణ కొనసాగొచ్చు

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా   

ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్‌) ఈ వారం మార్కెట్‌కు దారిచూపొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్‌ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్‌ నాలుగు రోజులే కావడంతో మార్కెట్‌ వర్గాల పారి్టసిపేషన్‌ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్‌ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు.

దేశీయంగా ట్రేడింగ్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా
తెలిపారు.  
 
ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్‌ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్‌ సీఆర్‌ఆర్‌(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి.

ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్‌బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి.

ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలపై కన్ను
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్‌ మినిట్స్‌) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్‌ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్‌ వివరాలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.

చివరి దశకు కార్పొరేట్‌ ఆరి్థక ఫలితాలు  
దేశీయ కార్పొరేట్‌ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్‌ ల్యాబ్స్, వోడాఫోన్‌ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్‌ పాయింట్స్, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్, ఫ్యూచర్‌ కన్జూమర్, గ్లోబల్‌ స్పిరిట్స్, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, హిందుస్థాన్‌ కాపర్, జాగరణ్‌ ప్రాకాశన్, మేఘ్‌మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్‌ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి.  

మారుతున్న ఎఫ్‌ఐఐల వైఖరి  
ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్‌స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు.

మరిన్ని వార్తలు